GuidePedia

0
Telangana Public Service Commission

త్వరలో గ్రూప్స్ I, II & IV నోటిఫికేషన్

తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీపీఎస్సీ) ఏర్పడిన వెంటనే 18 వేల ఉద్యోగ నియామకాలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. స్థానికతకు ఇప్పటి వరకు ఉన్న నిబంధనను మార్చి కొత్త నిబంధన తీసుకురానుంది. బోధన రుసుముల కోసం రూపొందిస్తున్న స్థానికత నిబంధనను ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తోంది. రాత పరీక్షలతో పాటు మౌఖిక పరీక్షలను తప్పనిసరి చేయనున్నట్లు తెలిసింది. టీపీఎస్సీని అతి త్వరలోనే ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నియమావళి సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి టీపీఎస్సీ ఏర్పాటు గురించి తెలిపారు. దీనిపై అతిత్వరలో తుది ఉత్తర్వులు రానున్నాయి. తర్వాత కేంద్ర ఆమోద ప్రక్రియ ఉంటుంది. జులైలోనే కేంద్ర ఆమోదం లభించి టీపీఎస్సీ అమల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. టీపీఎస్సీ ఏర్పడిన వెంటనే ఉద్యోగ నియామకాలు జరపాలని సీఎం కేసీఆర్‌ పట్టుదలతో ఉన్నారు.

For More Updates to Follow

Post a Comment

 
Top